ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభమైన నామినేషన్ల పర్వం ..పూర్తి అయిన గంటా నామినేషన్ ప్రక్రియ

MEDIA POWER
0

 

మీడియా పవర్, విశాఖపట్నం: నేడు భీమిలి నుంచి బీజేపీ జనసేన టిడిపి ల కూటమి అభ్యర్థి గంట శ్రీనివాస రావు  నామినేషన్  వేశారు. ఆయనతోపాటు 62 పంచాయతీల నాయకులు 9వార్డుల నుండి స్థానిక కూటమి నేతలు ఈ నామినేషన్  కార్యక్రమంలో పాల్గొన్నారు. జన సంద్రం మధ్య గంటా  నామినేషన్ వేసేందుకు వెళ్లారు. జనసంద్రాన్ని మరపించిన వూరేగింపు చూసి గెలుపు ఖాయమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనాకి వచ్చేసారు. గంటా భీమిలి నుండి రెండవ సారి పోటీచేస్తుండడం మరింత ఆసక్తినిపెంచింది.  

ఇది  ఇలావుండగా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ఈ నెల 24న నామినేషన్ వేయనున్నారు. పారిశ్రామిక వేత్తగా జాతీయ స్థాయిలో గుర్తింపువున్న రమేష్ వల్ల  అనకాపల్లి అభివృద్ధి చెందుతుందన్న వాదనలు ఇప్పటికే ఊపందుకోవడంతో బీజేపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది.  అయితే సీఎం రమేష్ నామినేషన్ వేసే సమయంలో కేంద్ర మంత్రులు ఎవరు హాజరు అవుతారు అన్న విషయం తెలియవలసి వుంది.  

ఇది ఇలావుండగా రేపు (19)న సికింద్రాబాద్, ఖమ్మం నామినేషన్ లు, కిషన్ రెడ్డి, వినోద్ రావు  నామినేషన్ కార్యక్రమానికి  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల , నల్గొండ, మహబూబ్ బాద్ అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నట్లు, జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్ కు దేవేంద్ర ఫడ్నవీస్‌, చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్ కు పీయూష్‌ గోయల్, మహబూబ్ బాద్ సీతారాం నాయక్ నామినేషన్ కు కిరణ్ రిజిజు రానున్నారు.

 23న భువనగిరి, 24న పెద్దపల్లి అదిలాబాద్ హైదారాబాద్ వరంగల్ ల నామినేషన్ లు వేయనున్నట్లు, పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్ కు అశ్విని వైష్ణవ్, అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్ కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, హైదారాబాద్ మాధవి లత నామినేషన్ కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్ కు అశ్వినీ వైష్ణవ్, 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్, కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ లా నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి లు, నిజమాబాద్ అరవింద్ నామినేషన్ కు అశ్విని వైష్ణవ్  హాజరు కానున్నట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.  

 


x

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">