కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మలసాల భరత్ కుమార్
మీడియా పవర్, అనకాపల్లి 26:- అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సమక్షంలో శుక్రవారం తగరంపూడి గ్రామం టిడిపి నాయకులు యాదగిరి రామచంద్రరావు తో పాటు మరో 20 మంది టిడిపి కార్యకర్తలు వైసీపీలో చేరారు. యాదగిరి బాబ్జి, బొడ్డు కనక, గంట పోలినాయుడు, గొలగన భాస్కరరావు, మిస్క ఏసు, గొల్ల గాని హరి, ముమ్మినీ ఈశ్వరరావు వైసీపీలో చేరినవారిలో వున్నారు. వీరికి భరత్ కుమార్ పార్టీ కండువా వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పార్టీ అధిష్టానం ఎప్పుడు విస్మరించదని వారికి సముచిత స్తానం కల్పిస్తుందని తెలిపారు. వైసీపీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయని తెలియజేశారు. యాదగిరి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. రానున్న ఎన్నికలలో భరత్ కుమార్ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీపీగొర్లి సూరిబాబు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందా, గ్రామ సర్పంచ్ యాదగిరి అప్పారావు, వైస్ ఎంపీపీ అయితి ఆనంద రాము, గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్నంశెట్టి సత్యనారాయణ, మాజీ వైస్ సర్పంచ్ నాగులపల్లి నరసింహనాయుడు, సోషల్ మీడియా కన్వీనర్ నందవరపు శ్రీను మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.