- జగంతోనే యాదవ సంక్షేమం సాధ్యం
- అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ , పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు లను గెలిపించండి
అనకాపల్లి, మీడియా పవర్: అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామంలో యాదవ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, పార్లమెంటు సభ్యురాలు బివి సత్యవతి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము యాదవులకు ఇవ్వలేని విలువ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎవరు వచ్చిన మొట్ట మొదటిగా కలవడానికి అవకాశం కల్పించారని మీ యాదవ కులానికి సంబంధించిన నన్ను నగర మేయర్ గా నియమించడం నా ఒక్కరికే కాదు యావత్ యాదవ కులానికి దక్కుతుందని చెప్పారు. ఆ గౌరవం దక్కేలా ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అలాంటి వ్యక్తిని మనము ఎన్నుకుంటే రానున్న రోజులలో మనకి మన కులానికి మేలుగరుగుతుందని తెలిపారు. అనకాపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనసాల భరత్ , పార్లమెంట్ సభ్యుడు బూడి ముత్యాల నాయుడుని గెలిపించాలని కోరారు. అనంతరం బూడిముత్యాల నాయుడు మాట్లాడుతూ పేదవాడికి ధనికునికి స్థానికుడికి స్థానికేతరుడికి పోటీ అని ఈ పోటీలో స్థానికతకు ప్రధమ ప్రాధాన్యం ఇవ్వలాలి పిలుపునిచ్చారు. కడప జిల్లా వ్యక్తికీ అనకాపల్లి తో సంబంధం ఏంటని ప్రశ్నించిన అయన ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని బ్యాంకు లూటీ చేసిన వ్యక్తికి అనకాపల్లిలో పార్లమెంటు సభ్యుడిగా కాదు కదా ఎన్నికల అనంతరం పార్సల్ చేసి కడప పంపిస్తారని ఎద్దేవా చేసారు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలుతో లబ్ధిపొందిన ప్రజలు జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో భరత్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని యాదవ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి నాయకులను నియమించి దాని ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగిస్తున్నారని గుర్తుచేశారు. మరల ఇదే ప్రభుత్వం వస్తే యాదవ కులానికి సంబంధించి పెద్దలు కోరిన ప్రకారం అన్నిటిని నెరవేర్చడానికి నేను పార్లమెంటు అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్ కన్నారావు వార్డ్ మెంబర్ భాస్కరరావు తదితరులు యాదవ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు....