మీడియా పవర్, విశాఖపట్నం నార్త్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత పాత్ర కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కె కె రాజు అన్నారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గ పార్టీ ఎన్నికల కార్యాలయంలో కె కె రాజు శనివారం రాత్రి యువత తో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్య వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. విద్యతోనే సామాన్యుడికి గుర్తింపు లభిస్తుందని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి ఇంట్లో విద్యావంతులు ఉండాలని వాస్తవ పరిస్థితి తెలుసుకొని రానున్న ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వికెపిసిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, విఎంఆర్డిఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ళశివ గణేష్,యువజన విభాగం నాయకులు ఏం.సునీల్, అంబటి శైలేష్,మువ్వల సంతోష్ , సమ్మెట్ల వెంకటేష్ మరియు మండల యువజన విభాగం అధ్యక్షులు, యూత్ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default