భీమిలి: భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న జలగెడ్డ స్మశానవాటిక స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జాచేసి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని భీమిలి జోనల్ కమీషనర్ కనకమహాలక్ష్మికి ఎగువపేట గ్రామాభివృద్ధి సేవాసంఘం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. సముద్రతీరాన్ని ఆనుకొని మత్స్యకారుల స్మశానవాటికలు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నాయని, రాష్ర్టంలో తీరాన్ని ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారుల శ్మశానవాటికలు ఇలానే ఉంటాయని చెప్పారు. అలాంటి శ్మశానవాటికలను కొంతమంది వ్యక్తులు కబ్జాలు చేసారని, రోడ్డు ప్రక్కన హోటల్ నిర్మించి వ్యాపారం చేసుకొనే సదరు వ్యక్తి హోటల్ వెనుక ఉండే శ్మశానవాటికను కూడా హోటల్లో భాగంగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. హోటల్ నిర్వాహకులకు జీవిఎంసీ అధికారులు వత్తాసు పలికే విధంగా అక్కడ పార్దివదేహాలను ఖననం చేయకూడదని నోటీసు బోర్డులు పెట్టడం మరీ విడ్డురంగా ఉందని అన్నారు. సి ఆర్ జెడ్ జోన్లో అది కూడా నోడెవలప్మెంట్ జోన్లో హోటల్ నిర్మించారని, జీవిఎంసీ, వుడా అనుమతులు లేవని, బిల్డింగ్ ప్లాన్ కూడా లేదని, ఇలా సదరు వ్యక్తి అక్రమాలకు పాల్పడినా ఎందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దయచేసి అక్రమకట్టడాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలని, అదేవిదంగా హైకోర్టు ఉత్తర్వులు వచ్చేంతవరకు స్మశానవాటిక దగ్గర జీవిఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన నోటీసుబోర్డులను తొలగించవలసినదిగా కోరామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగువపేట గ్రామాభివృద్ధి సేవాసంఘం అధ్యక్షులు గంటా నూకరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లిపిల్లి నర్సింగరావు, కోశాధికారి బర్రి కొండబాబు, మైలపల్లి షణ్ముఖరావు, వాసుపల్లి కొండబాబు, కారి చిన్న, సభ్యులు పి. నర్సింగరావు, ఎమ్.ధనరాజు, ఎమ్ కొండ, వి.అప్పన్న, ఎస్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post a Comment
0Comments
3/related/default