శ్రీకాకుళం, పోలాకి, నవంబర్ 01: నవంబర్ 01వ తేదీ శుక్రవారం పోలాకి మండలం, జడూరు గ్రామంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ నిర్వహించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఇంటి వద్దనే సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని సంక్షేమ పథకాలు అమలు తీరు పింఛన్లు పంపిణీ అయన సమర్ధనాయకత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. అనంతరం సచివాలయం సిబ్బంది పనితీరును పరిశీలించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.